Homeజిల్లాలుఅనంతపురంగెలుపునకు కృషి చేసిన సిపిఐ నేతలకు కృతజ్ఞతలు..మేయర్‌ రమేష్‌గౌడ్‌

గెలుపునకు కృషి చేసిన సిపిఐ నేతలకు కృతజ్ఞతలు..మేయర్‌ రమేష్‌గౌడ్‌

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసిపి మేయర్‌ గా తన గెలుపునకు కీలక పాత్ర పోషించిన సిపిఐ నాయకులకు నగర మేయర్‌ రమేష్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయానికి వచ్చిన మేయర్‌ రమేష్‌గౌడ్‌ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్‌, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు రాజేష్‌గౌడ్‌, వి.కె.కృష్ణుడులను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్‌ రమేష్‌గౌడ్‌ మాట్లాడుతూ అనంతపురం నగరంలో బీజేపీ అభ్యర్థిని ఓడించి తమకు విజయాన్ని అందించిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర స్థాయి కూటమి నాయకులు నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను విడదీసే పార్టీలకు అనంతపురంలో స్థానం లేదని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మేయర్‌ ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేసిన సిపిఐ నాయకులు, కార్యకర్తలకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు