Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడి అత్యంత దారుణం

రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడి అత్యంత దారుణం

- Advertisement -

విద్యార్థిని పై దాడి చేసిన నిందితుడిని తక్షణమే శిక్షించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర డిమాండ్
విశాలాంధ్ర ధర్మవరం;; రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పై దాడి చేయడం అత్యంత దారుణమని, విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిని తక్షణమే కఠినంగా శిక్షించాలని జిల్లా కార్యదర్శి శేషం మహేంద్ర డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గోపిక లక్ష్మిపై జరిగిన విచక్షణ రహితంగా జరిగిన దాడిని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందనీ తెలిపారు . విద్యను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థినిపై ఇలాంటి దాడి జరగడం అత్యంత బాధాకరం, ఆందోళనకరమని విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన పాఠశాల ప్రాంగణంలోనే ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం రాష్ట్రంలో విద్యార్థుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు. విద్యార్థినిపై చెట్లు కోసే రంపంతో దాడి చేసి గొంతు కోసిన సంఘటన సమాజాన్ని కలచి వేస్తుందని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని అన్నారు . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించి, ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ తక్షణ చర్యలు చేపట్టాలనీ డిమాండ్ చేసారు . బాధిత విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భద్రతపై బాధ్యత వహించాలనీ రాష్ట్రంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, బాలికల భద్రత, విద్యాసంస్థల్లో రక్షణ చర్యలు ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశాలుగా ఉండాలనీ కేవలం విద్యా సంస్కరణలు, అభివృద్ధి ప్రకటనలు చేయడం మాత్రమే ప్రభుత్వ బాధ్యత కాదనీ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత అని తెలిపారు. ఒకపక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పాఠశాలల్లోకి, కళాశాలల్లోకి విద్యార్థి సంఘ నాయకులు,ఇతర ప్రజా సంఘ నాయకులను అనుమతించరాదని జారీ చేసిన ఉత్తర్వులు నీటి మూటలేనా అని అన్నారు. ఒక విద్యార్థినిపై దాడి జరిగిన తర్వాత స్పందించి, కొద్దిరోజుల పాటు హడావుడి చేసి, ఆపై సమస్యను మరిచిపోవడం ప్రభుత్వానికి తగదనీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలనీ పాఠశాలల వద్ద భద్రతా లోపాలను గుర్తించి సరిదిద్దాలనీ తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు