విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని పోలినేనిపాలెం మరియు వలేటివారిపాలెం రైతుసేవ కేంద్రాలలో మండల వ్యవసాయ అధికారి కే వి శేషారెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈ పంట యొక్క ఆవశ్యకత మరియు రైతువారి ప్రభుత్వ పథకాలు ఈ పంట నే ప్రామాణికం అని తెలియచేసి పోలినేనిపాలెం లో ఈ పంట నమోదు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ దగ్గరలోని రైతుసేవాకేంద్రం లో తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి పేరు నమోదు చేసుకొనుటకు ఈ నెల 23 చివరితేది అని తెలిపారు. కనుక అర్హత కలిగి పేరు నమోదు చేసుకోని ప్రతి ఒక్క రైతు తమ రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది, గ్రామ నాయకులూ మరియు రైతులు పాల్గొన్నారు


