పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం: జిల్లాలోని యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త బి. శ్రీరాములు సూచించారు. పొగాకు రహిత యువత ప్రచారం (టి ఎఫ్ వై సి 4.0) లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కట్టా వెంకటేశ్వర్లు, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని మంగళవారి కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వస్తాయన్నారు. కావున యువత చిన్న వయస్సులోనే పొగాకుకు బానిస కాకుండా ఉండాలన్నారు. అనంతరం పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంగళవారి కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి *డా. రోహిత్ నాయుడు, ఏ ఎన్ ఎం లు,ఆశాలు, మాధవి మరియు ప్రజలు పాల్గొన్నారు
పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
- Advertisement -


