విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల పరిధిలోనే తొగలగల్లు గ్రామంలో వేసవికి ముందే త్రాగునీటి సమస్య నెలకొందని తక్షరమే అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్నందున గ్రామంల్లో తాగు నీటి సమస్య జటిలంగా ఉందన్నారు. గ్రామంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుముఖం పట్టడం నీటి వనరులు వట్టిపోతుండటంతో గ్రామంలో త్రాగునీటి కొరత ఏర్పడిందని, దీనికి తోడు గ్రామంలోనే చేతిపంపులు పనిచేయకపోవడం, మరమత్తులకు సైతం నోచుకోకపోవటంతో నీటి సమస్య తలెత్తిందన్నారు. ప్రజలు తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో సక్రమంగా తాగునీరు సరఫరా చేయడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వారానికి ఓ సారి మాత్రమే నీరు వదులుతున్నారని, ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ పంచాయితీ అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. తొగలగల్లు గ్రామంలో తాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చే పడతామని జగన్నాథ్ హెచ్చరించారు.
తొగలగల్లులో తాగునీటి సమస్యను పరిష్కరించాలి
- Advertisement -
RELATED ARTICLES


