Homeతెలంగాణరాష్ట్ర ప్రభుత్వం నేతన్న భరోసా, పొదుపు నిధులు వెంటనే విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం నేతన్న భరోసా, పొదుపు నిధులు వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెంకట్రాములు
విశాలాంధ్ర‌, హైద‌రాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన నేతన్న భరోసా,త్రీఫ్టు ఫండ్ నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు డిమాండ్ చేశారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ధనంజయ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ చేనేత కార్మికుల ఎడల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పొదుపు నిధుల‌ పథకానికి 18 నెలలుగా నిధులు విడుదల చేయలేదని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . నేతన్న భరోసా పథకానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే నిధులను విడుదల చేసి చేనేతలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు రద్దుచేసి తిరిగి వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలకు కావలసిన చేనేత వస్త్రాలకు ముందుగానే టెస్కోకు ఆర్డర్ ఇచ్చి చేనేత కార్మికులకు చేతినిండా పనులు కలిగించాలని, పెరిగిన ధరల కనుగుణంగా కూలి రేట్లు పెంచి అమలు జరపాలని , 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులందరికీ నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలన్నారు . ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మి నరసయ్య ప్రసంగిస్తూ టెస్కోకు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. చేనేత రంగానికి నిధులను పెంచి వారి సంక్షేమానికి అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న కాలంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో కోట రాజయ్య , చేపూరి ధనంజయ, మెరుగు చంద్రప్రకాష్, కే .బాలమోహన్, గోపయ్య , సత్తయ్య, వెంకటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు