Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహ్యాపీనెస్ ప్రోగ్రాం తో మంచి ఉపయోగాలు ఉంటాయి..

హ్యాపీనెస్ ప్రోగ్రాం తో మంచి ఉపయోగాలు ఉంటాయి..

- Advertisement -

సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్.. జిఆర్. అనూప్
విశాలాంధ్ర ధర్మవరం;! హ్యాపీ నెస్ ప్రోగ్రాం వలన మంచి ఉపయోగాలు ఉంటాయని సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నిర్వాహకులు జి ఆర్ అనుప్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణమండపం (స్పందన హాస్పిటల్ దగ్గర-పుట్టపర్తి రోడ్) నందు అక్టోబర్ 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది కళాత్మక జీవనం అని, ఉత్సాహమే జీవితం, ఆనందమే జీవితం, ప్రేమే జీవితం అవుతుంది అన్నారు. ప్రాణాయామం, సుదర్శన క్రియ, ధ్యానం, యోగ నేర్చుకోవడానికి ఇదొక అద్భుతమైన ప్రోగ్రామ్ అని తెలిపారు. ఉదయం 5:30 నుండి 8:30 వరకు ఒక బ్యాచ్, తదుపరి సాయంత్రం ఐదున్నర గంటల నుండి 8:30 గంటల వరకు రెండవ బ్యాచ్ ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సెల్ నెంబర్ శ్రీకాంత్ 9642254375 కు గాని, ధనుంజయ 9666842255 సంప్రదించాలని తెలిపారు. కావున ఈ హ్యాపీనెస్ ప్రోగ్రాములు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని చక్కటి ఆరోగ్యం పొందాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు