శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, స్వీట్ లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ నామ ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో పట్టణంలోని శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి సేవాదాతగా కీర్తిశేషులు ఎర్రమల కృష్ణమూర్తి, వారి కుమారుడు చెన్నప్ప దాతలుగా నిర్వహించినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి చేస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాల పట్ల వారు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వరంలాగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
సేవలు చేయటములోనే నిజమైన సంతృప్తి ఉంది
- Advertisement -
RELATED ARTICLES


