ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మతి ఎమ్. వనితా వాణి
విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజానికి ఓ సందేశం సిస్టర్ నివేదిత అని, ఆమె చేసిన సేవలు నర్స్ లకు ఆదర్శం అని ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనితా వాణి పేర్కొన్నారు. సిస్టర్ నివేదిత జయంతి సందర్బంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జూనియర్ కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. నేటి యువత సిస్టర్ నివేదిత ను ఆదర్శం గా తీసుకుని సామాజిక సేవలు చేయాలని వారు ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో కళాశాల కమిటీ తరుపున బండి వేణుగోపాల్, ప్రభాకర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
సిస్టర్ నివేదిత సామాజిక సేవ అందరికీ ఆదర్శం
- Advertisement -
RELATED ARTICLES


