Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఏపీజీబీలో సిబ్బంది కొరత తీర్చాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో సిబ్బంది కొరత తీర్చాలంటూ మంగళవారం వైసీపీ జిల్లా కమిటీ సభ్యులు బొగ్గుల తిక్కన్న, ప్రజాసంఘాల నాయకులు పరమేష్, లక్ష్మన్నలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నందు సుమారు 18 వేల మంది ఖాతాదారులు ఉన్నారని, ప్రతి రోజూ 300 మంది ఖాతాదారులకు పైగా లావాదేవీలు జరుపుతున్నారని తెలిపారు. ఇంతమంది ఖాతాదారులకు సేవలు అందించడం బ్యాంకు సిబ్బందికి కష్టంగా మారిందన్నారు. కావున అధికారులు స్పందించి ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకులో సిబ్బంది కొరత తీర్చాలని, బ్యాంకు బ్రాంచ్ లో ఏటిఎమ్ సెంటర్ ను ఏర్పాటు చేసి, నైట్ వాచ్ మెన్ ను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img