Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

కార్మికోద్యమ నిర్మాణంలో
వీవీఆర్‌ కృషి చిరస్మరణీయం

ప్రథమ వర్ధంతి సభలో సీపీిఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: విశాఖలో కార్మిక, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో అమరజీవి వీవీ రామారావు (వీవీఆర్‌) ఎనలేని కృషి చేశారని, దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పాటు అందించిన వ్యక్తుల్లో ఆయన ముందు ఉంటారని సీపీిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం ఇక్కడి ఎంవీపీ కాలనీలోని తపస్య కళ్యాణ మండపంలో వీవీఆర్‌ ప్రథమ వర్ధంతి సభ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పడాల రమణ అధ్యక్షతన జరిగింది. ముందుగా వీవీ రామారావు చిత్రపటానికి కుటుంబ సభ్యులు, హాజరైన ప్రముఖులు, నాయకులు శ్రేయోభి లాషులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్‌ వివి రామారావు ఉద్యమ స్మృతులపై రచించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. నారాయణ ప్రసంగం కొనసాగిస్తూ, రామారావు లేరన్న నిజం నమ్మలేక పోతున్నానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమ నిర్మాణంలో రామారావు కృషి ఎనలేనిది అన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణకు, విశాఖలో కార్మిక ఉద్యమ నిర్మాణానికి, కమ్యూనిస్టు ఉద్యమ పరిరక్షణకు రామారావు కృషి చేశారని కొనియాడారు. స్వార్థం లేకుండా, ఉన్నది ఉన్నట్టు, కుండబద్దలు కొట్టేలా మాట్లాడడం రామారావు నైజం అన్నారు. పార్టీ లోపల అనేక విషయాలపై లోతుగా మాట్లాడేవారని, నాయకుల లోపాలను ఎత్తిచూపేవార న్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖ కార్మిక ఉద్యమంతో మమేకమై నాలుగు దశాబ్దాల పాటు వీవీఆర్‌ పనిచేశారన్నారు. కార్మిక హక్కుల్ని కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు ఆయనేనన్నారు. విశాఖ పోర్టు ట్రస్టీగా 30 ఏళ్ల పాటు సేవలందించిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం పోరాటమే రామారావుకు మనం అర్పించే నిజమైన నివాళులు అన్నారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖలో కార్మిక ఉద్యమాన్ని నడిపిన దమ్మున్న నాయకుడు రామారావే అన్నారు. 1991 నుండి2007 వరకు విశాఖ ఉక్కు కార్మిక ఉద్యమ నేతగా పరిరక్షణ కోసం పోరాటం చేశారన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్ర నాథ్‌ మాట్లాడుతూ కార్మిక ఉద్యమ నిర్మాణంలో, ఢల్లీి, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కమ్యూనిస్టు, కార్మిక సంఘాల కార్యాలయాల నిర్మాణంలో కామ్రేడ్‌ రామారావు ఎనలేని కృషి చేశారన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం రామారావు రాజీలేని పోరాటం చేశారన్నారు. కార్మిక సంఘాల నాయకుల్లో విశ్వాసాన్ని కలిగించిన నాయకుడు రామారావే అన్నారు. అరసం నాయకులు కొండపల్లి మాధవరావు మాట్లాడుతూ రామారావు మాటలు తుటాలా ఉంటాయన్నారు. సాహి త్యంతో కూడిన చమత్కార మాటలతో కార్మికులను ఎంతో ఉత్సాహ పరిచారన్నారు. పర్యావరణ వేత్త, జనసేన రాష్ట్ర కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విలు వలు తగ్గిపోతున్న నేటి కాలంలో రామారావు లాంటి విలు వలు ఉన్న నాయకులు దొరకడం అదృష్టమేనన్నారు. ఎందరికో చేయూతనందించి, మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపిన మహా నాయకుడు రామారావే అన్నారు. విశాఖపట్నం హార్బర్‌ అండ్‌ పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బీసీహెచ్‌ మసేన్‌, గీతం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ శివరామకృష్ణ, మాజీ కార్పొరేటర్‌ ఆళ్ల శ్రీనివాస్‌, నండూరి రామకృష్ణ, చెన్నా దాస్‌, అల్లు బాబూరావు, పప్పల అప్పలనాయుడు, జి.వామన మూర్తి, ఎస్‌ కే రెహిమాన్‌, ఎం.మన్మధరావు, బి.వెంకట్రావు మాట్లాడుతూ రామారావు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. రామారావు భార్య అఖిల కుమారి, కుమార్తెలు అజిత, సమతా, మమత, అల్లుళ్లు రామకృష్ణ ప్రసాద్‌, కిషోర్‌ తోపాటు మనవళ్ళు, మనవరాళ్లు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అనేక కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img