Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

కొడుకుల వివాదంపై మోహన్ బాబు సీరియస్! వీడియో డిలీట్

మంచు మోహ‌న్ బాబు త‌న‌యులు, టాలీవుడ్ హీరోలు విష్ణు మంచు, మంచు మ‌నోజ్ మ‌ధ్య ఇన్నాళ్లు స్త‌బ్దుగా ఉన్న గొడ‌వ‌లు రోడ్డున ప‌డ్డాయి. మోహ‌న్ బాబు కొడుకులుగా క‌లిసి మెలిసి ఉండే వీళ్ల మ‌ధ్య కొన్నాళ్లుగా దూరంగా పెరిగింద‌నే చెప్పాలి. రీసెంట్‌గా జ‌రిగిన మంచు మ‌నోజ్ పెళ్లి, మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. అయితే ఇదిప్పుడు గాలివాన‌గా మారింది. ఏకంగా వారు కొట్టుకునే దాకా వెళ్లింద‌నే చెప్పాలి. అయితే విష‌యం తెలుసుకున్న మోహ‌న్ బాబు రంగంలోకి దిగారు. విష్ణు, మ‌నోజ్‌ల‌పై సీరియ‌స్ అయ్యారు. దీంతో మంచు మ‌నోజ్ త‌న ఫేస్ బుక్ స్టేట‌స్‌లో గొడ‌వ‌కు సంబంధించిన వీడియోను డిలీట్ చేశారు. పొద్దునే ఇలా విష్ణు త‌న‌పై, త‌న బంధువుల‌పై దాడి చేస్తున్నాడంటూ వీడియోను మ‌నోజ్ త‌న ఫేస్ బుక్ స్టేట‌స్‌లో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కుటుంబంలో గొడ‌వ‌లు ఉండ‌టం కామన్‌గానే ఉంటాయి. అయితే దీనికి సోష‌ల్ మీడియా వ‌ర‌కు ఎందుకు ఎక్కాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న సీరియ‌స్ అయిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు మంచు బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మేంట‌నేది క్లియ‌ర్‌గా తెలియ‌టం లేదు. అయితే సార‌థి అనే వ్య‌క్తి కార‌ణంగానే ఈ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌నే మాట గ‌ట్టిగా వినిపిస్తుంది. మోహ‌న్ బాబుకు సార‌థి అనే వ్య‌క్తి త‌మ్ముడు వ‌రుస అవుతాడు. విష్ణు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పటి నుంచి త‌న‌కు సార‌థి ద‌గ్గ‌ర‌గా ఉండేవాడు. త‌ర్వాత మోహ‌న్ బాబుకే ద‌గ్గ‌ర‌య్యాడు. కొన్నాళ్లుగా మంచు మ‌నోజ్‌తో స‌న్నిహితంగా ఉంటున్నారట‌. అయితే స‌ద‌రు సార‌థి అనే వ్య‌క్తి ఏం చేశాడు. దానికి మంచు విష్ణు అంత సీరియ‌స్ ఎందుక‌య్యాడ‌నేది మాత్రం ఇంకా తెలియ‌టం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img