Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

ఘనంగా బెలారస్‌ స్వాతంత్య్ర దినోత్సవం

మిన్స్క్‌ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని బెలారస్‌ ఘనంగా నిర్వహించింది. జులై 3వ తేదీని స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోవాలని 1996, నవంబరు 24న జరిగింది. ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయానికి 88.18శాతం అనుకూల ఓట్లు వచ్చాయి. అదే ఏడాది డిసెంబరులో అలెగ్జాండర్‌ లుకాషెండో సంబంధిత తీర్మానంపై సంతకం చేశారు. జులై 3వ తేదీని రిపబ్లిక్‌ ఆఫ్‌ బెలారస స్వాతంత్య్ర దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజును అధికారిక సెలవు దినంగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జులై 3వ తేదీన అమరవీరులకు దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తారు. బెలారస్‌ దేశ సాధన పోరులో విజయాన్ని వేడుక చేసుకుంటారు. 1944 జులై 3న మిన్స్క్‌కు విమోచనం లభించింది.
అమెరికా, రష్యా శుభాకాంక్షలు
బెలారస్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కారించు కొని అమెరికా, రష్యా దేశాలు వేర్వేరు ప్రకటనల్లో బెలారస్‌ అధ్యక్షుడు లుకాషెంకోకు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా తరపున బెలారస్‌కు ఆంటోనీ బ్లింకెన్‌ లేఖ పంపారు. ‘అమెరికా తరపున బెలారస్‌కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. బెలారస్‌ వాసులు, బలవంతంగా దేశాన్ని, సొంత వారిని విడిచిపెట్టిన వారందరికీ తమ భవిష్యత్‌ను నిర్ణయించుకునే అవకాశం ఉండాలి. స్వాత్రంత్య్ర సాధన కోసం జైలుకు వెళ్లిన 1,500 మంది బెలారస్‌ నాయకుల ధైర్యాన్ని అభినందిస్తున్నాం. బేషరతుగా వారిని విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. బెలారస్‌ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వానికి సంబంధించిన మార్గాన్ని అనుసరించే వారికి అండగా ఉంటాం’ అని బ్లింకెన్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా బెలారస్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తమ దేశాల స్నేహ బంధాన్ని మరింత పెంచుకోవాలని, పరస్పర సహకార బంధాన్ని పటిష్ఠపర్చుకోవాలని ఆకాంక్షించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని, బాహ్యా సవాళ్లను కలిసి అధిగమిద్దామని పుతిన్‌ పేర్కొన్నారు. నిర్మాణాత్మక ద్వైపాక్షిక సంబంధాలు, వ్యవస్థాగత సహకార బంధాన్ని పటిష్టపర్చుకుందామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img