Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీనికితోడు అక్టోబర్‌ 28వ తేదీ రాత్రి నుంచి ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌, అమరావతి కేంద్రాలు తెలిపాయి. శ్రీలంక మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడిరచాయి. ఈ అల్పపీడనం.. వాయుగుండం, ఆపై తీవ్ర వాయిగుండంగా మారే సూచనలు ఉన్నాయి. దీంతో అక్టోబర్‌ 29 నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోనే వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పములో అక్టోబర్‌ 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img