Monday, February 6, 2023
Monday, February 6, 2023

ద్రవిడ్‌ కోచింగ్‌పై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం : అశ్విన్‌

న్యూదిల్లీ : ఇటీవల టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌ శైలిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. అతడు ఎంతో మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడని పేర్కొన్నాడు. ‘రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌ శైలిపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. అండర్‌-19 క్రికెట్‌ ద్వారా అతడు ఎంతో మంది నాణ్యమైన యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు. సీనియర్‌ జట్టును కూడా అలాగే తయారు చేస్తాడనుకుంటున్నా. అతడి రాకతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో సందడి వాతావరణం నెలకొంది’ అని అశ్విన్‌ చెప్పాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా కొత్త కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. మరోవైపు, టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లి నుంచి తప్పుకోవడంతో.. రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌ పగ్గాలందుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img