Friday, December 2, 2022
Friday, December 2, 2022

ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, భవిష్యత్‌ తరాలకు అందించాలి

: మంత్రి ఎర్రబెల్లి
ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి, భవిష్యత్‌ తరాలకు అందించాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజలందరికి ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నీటిని వినియోగించడంలో, పొదుపు చేయడంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం మిగతా రాష్ట్రాలకు విభిన్నం అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒకవైపు నదీజలాల్లో వాటాను పూర్తిగా సద్వినియోగం చేస్తూ ప్రణాళికాబద్ధంగా బరాజ్‌లను, రిజర్వాయర్లను నిర్మిస్తూనే మరోవైపు నదుల పునరుజ్జీవనానికి బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.మిషన్‌ కాకతీయ ద్వారా కాకతీయుల నాటి 27,785 గొలుసుకట్టు చెరువులు, కుంటలను బాగు చేసి, గ్రామాల్లో భూగర్భ నీటి మట్టం 4.35 మీటర్లు పెంపునకు దోహదం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గూడాలు, తండాలకు కూడా నల్లాల ద్వారా శుద్ధి చేసిన, స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు దేశానికే దిక్సూచిగా నిలుస్తుండటం తెలంగాణకు గర్వకారణం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img