London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

విద్యా హక్కు సాధనలో అందరి భాగస్వామ్యం కీలకం!

మల్లాడి శ్రీనగేష్‌, బి. హరి వెంకట రమణ

నేడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయి, పిల్లలు ఆయా మార్పులను అందుకోగలుగు తున్నారా? విద్యాహక్కు అమలులో తల్లితండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత, పంచాయితీల బాధ్యత, అసలు పిల్లల సామర్ధ్యాలపై ప్రత్యామ్నాయ నివేదికలు ఏం చెపుతున్నాయి అని చర్చిద్దాం. సమాజంలో ఆడపిల్లల చదువుపై ఇప్పటికీ వివక్ష, ఉన్నత చదువులను ప్రోత్సహించకపోవడం గమనార్హం. దీని వలన సెకండరీ స్థాయిలో ఎక్కువ మంది బడి మానేస్తున్నారు. డైస్‌ గణాంకాల ప్రకారం, సుమారు 14.7 శాతం మంది సెకండరీ స్థాయిలో బడి మానేస్తుండగా, బాలికలు సుమారు 13.7 శాతం మంది చదువుకు దూరం అవుతున్నారని మానవ అభివృద్ధి నివేదిక 2020-21 తెలియజేసింది. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. ఆడపిల్లల భద్రత విషయంలో, వరకట్న సమస్యలు జోడిరచి చిన్న వయసులోనే ఆడ పిల్లలకు వివాహంచేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు. ఆర్థిక పరిస్థితి, ఆడ మగ వ్యత్యాసం వలన గ్రామాల్లో మగ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు పంపించడం, ఆడ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపడమనే అంశాలు అనేకం. కరోనా తర్వాత, ముందూ కూడా చాలామంది పేద కుటుంబాలలో అనగా కూలి, రోజువారీ ఆదాయాలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థిక స్థోమతలేక తమ పిల్లల చదువును నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలు అనేకం. పాఠశాలల విలీనం వలన ప్రాథóమిక పాఠశాలలు తమ ఇంటికి దూరం కావడం, ఉన్నత పాఠశాలలు గ్రామాలకు దూరంలో ఉండడం అనేది కూడా ఒక కారణంగా పరిణమించింది. ఆడ పిల్లలను దూరం పంపించలేక, వారికి భద్రత ఉండదని తలిదండ్రులు కూలిపనికి వెళ్తే చిన్న పిల్లలను చూసుకోవడానికి ఆడ పిల్లలను ఇంటిపట్టునే ఉంచుతున్నారు. మరోవైపు చిన్న పిల్లలను తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులకు చేదోడుగా వారిని పనుల్లో పెట్టడం తద్వారా బాల కార్మికులుగా మార్చడం, చదువుకు దూరం చేయడం, బాల్య వివాహాలు ఇవన్నీ ఆడ పిల్లలకు ఒక శాపంగా పరిణమిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దడం, బడుగు, బలహీన కుటుంబాలకు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వ పరంగా సాయం చేయడం -ఆడ పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, ప్రతి బడిలో బాలుడు, బాలిక తప్పక పాఠశాలలో చేరేలా చేయడం, అందరూ చదువు సంపదలను సరి సమానంగా అందుకునేలా సమాజం తన ప్రధాన బాధ్యతగా గుర్తించి తగిన కృషి చేయాలి.
గ్రామీణ ప్రాంత పిల్లల చదువు, ప్రగతి తలిదండ్రులపైన, సమాజంపైన ఉన్నదని తేటతెల్లమౌతోంది. దీనికి పాఠశాల యాజమాన్య కమిటీలు, స్థానిక సంస్థలు ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం పాఠశాల అభివృద్ధికి పాటుపడాలి. పాఠశాల అభివృద్ధి అనగా పిల్లల అభ్యసనా సామర్ధ్యాలు, వారి ప్రగతి ప్రధానాంశాలుగా గ్రహించాలి. దీనికి ఉపాధ్యాయ బృందాలు తలిదండ్రులతో కలిసి వారి ప్రగతి గురించి చర్చించి పిల్లల ప్రగతి, వారి విద్యా సామర్ధ్యాల గురించి సరైన ప్రణాళికలు రచించి ఉమ్మడిగా కృషి చేయాలి. దీనికి తోడు స్థానిక పంచాయతీ యాజమాన్యం కూడా తమ వంతు కృషిగా పాఠశాల పురోగతి, విద్యార్థుల భద్రత, మంచినీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రత, పిల్లలకు పరిశుభ్ర వాతావరణంలో పాఠశాల నిర్వహించేలా కృషి చేయాలి. ఈ ప్రక్రియలో సమాజంలో గ్రామ పెద్దలు పంచాయతీ కార్యాలయాన్ని ఈ సౌకర్యాల కల్పనలో ఎటువంటి జాప్యం, అలసత్వం లేకుండా జాగ్రత్త వహించాలి. పాఠశాల భద్రత, పిల్లల సంక్షేమం, రక్షణ, అజమాయిషీ, పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేలా అజమాయిషీ చేయడం, బడి బయట వున్న పిల్లలను పాఠశాలకు తీసుకురావడం వంటి ముఖ్యమైన బాధ్యతలు తలిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామ పంచాయతీ కలిసికట్టుగా ముందుకువచ్చి కృషిచేస్తే ప్రతి పాఠశాల నాణ్యమైన విద్యాదిశగా పయనించడం సులభం.
తల్లితండ్రుల బాధ్యత
పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడానికి విద్యార్థులు తరగతి వారీ అభ్యాసనా సామర్ద్యాలు సాధించడానికి తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం, బాలల విద్యలో సమాజం, తలిదండ్రుల పాత్ర ప్రధానమైనదని దానికి పాఠశాల యాజమాన్య కమిటీ, తలిదండ్రులు, స్థానిక సంస్థలు ఒక ప్రధాన భూమిక వహించాలని ఇది చట్టపరమైన నిబంధనగా చట్టంలో సెక్షన్‌ 21, 22 లో పొందుపరిచారు. ప్రధానంగా తలిదండ్రులు, గ్రామ పెద్దలు తరచూ పాఠశాలను సందర్శించడం, విద్యార్థుల ప్రగతి గురించి చర్చించడం ప్రధాన అంశంగా గుర్తించాలి. తలిదండ్రులు తరచూ పిల్లల పాఠశాలను సందర్శించి వారి ఉపాధ్యాయులతో పిల్లల చదువు గురించి చర్చించాలి. చదువుకున్న లేదా నిరక్షరాస్యులైన తలిదండ్రులైనప్పటికీ వారు ఉపాధ్యాయులను సంప్రదించి వారి పిల్లలు ప్రతి దినం బడికి వస్తున్నారా లేదా, బడికి వస్తే తరగతి గదిలో ఎలా వింటున్నారు, అభ్యసనలో పాల్గొంటున్నారా లేక సమస్యలేమైనా ఎదుర్కొంటున్నారా అన్న విషయాలను అజమాయిషీ చేయాలి. ఏదైనా పిల్లల గురించి ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తే ఆయా కారణాలను క్షుణంగా పరిశీలించి దానిలో వారి పాత్ర ఉంటే తప్పక ఆయా విషయాలపై దృష్టి సారించాలి.
అసర్‌ నివేదిక ఏం చెప్పింది
ప్రాథమిక, దేశవ్యాప్తంగా సర్వే సంవత్సరం తర్వాత నిర్వహిస్తారు. ఇది 3-16 సంవత్సరాల వయస్సు గల పిల్లల నమోదు స్థితి, 5-16 సంవత్సరాల వయస్సు గల పిల్లల ప్రాథమిక పఠనం, అంకగణిత స్థాయిలపై డేటాను సేకరిస్తుంది. పిల్లల విద్యాభ్యాసానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి పెడుతుంది. 2023లో యువత (14-18 సంవత్సరాల వయస్సు) పఠనం, గణిత నైపుణ్యాలను రోజువారీ పరిస్థితులకు వారి ఆకాంక్షలకు వర్తింపజేయగల సామర్థ్యంపై ఫలితాలను విడుదలచేసింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల చదువు, అభ్యాస స్థితిపై విడుదలైన విద్యా నివేదిక-2023…ఆందోళన రేకెత్తిస్తోంది. 14 నుంచి 18 ఏళ్ల వయస్సున్న విద్యార్థులపై చేపట్టిన ఈ సర్వేలో 25 శాతం మంది తమ ప్రాంతీయ భాషల్లోని రెండవ తరగతి పాఠ్యాంశాలను కూడా సరిగ్గా చదవలేకపోతున్నారని వెల్లడిరచింది. పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, సిబిఎస్‌ఈ, ఐబి అని మన ప్రభుత్వం చెబుతున్నందున అందుకు తగ్గ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయవలసి వుంది. ప్రధానంగా ఎర్లీ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌, పిల్లల ప్రాధమిక విద్యపై దృష్టి పెట్టాలి, లేదంటే పిల్లల అభ్యాసన సామర్ధ్యాలు పడిపోతాయి. పునాదిలో బలం లేనిది మనం ఏమీ చేయలేని పరిస్థితి.

(వ్యాసకర్తలు విద్యా విషయ విశ్లేషకులు)
ఫోన్‌: 98660 84124

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img