Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

వ్యతిరేకంగా పోస్ట్‌ చేస్తే చాలు అక్రమ కేసులు

మాజీ మంత్రి పరిటాల సునీత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే చాలు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. టీడీపీలో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారో వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే కొల్లు రవీంద్రను కూడా అక్రమ కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటికి ఒకటి తప్పకుండా చెల్లిస్తామన్నారు. మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు లేని లోటు బాగా కనిపిస్తుందన్నారు. నడకుదిటి చనిపోయిన సమయంలో కోవిడ్‌ వల్ల రావడానికి వీలు పడలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img