Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎస్ హెచ్ ఐ వి అనంత జిల్లా అధ్యక్షులుగా డీ కొండయ్య ఎంపిక

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : సమాచార హక్కుల ఐక్యవేదిక సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బి. లాల్యానాయక్ ఆదేశాలు మేరకు రాష్ట్ర కార్యదర్శిఏ. మధు ఆధ్వర్యంలో శనివారం అనంత జిల్లా అధ్యక్షులుగా డి.కొండయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ… సాధికారిత, సమయపాలన, గ్రామ స్వరాజ్యం కోసం నిరంతరం కృషి చేయాలని రాజ్యాంగంలో పొందపరిచిన 2005 ప్రకారం అనంత జిల్లాలో ప్రజా చైతన్యం కొరకు నిరంతరం కృషి చేయాలన్నారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… అనంత జిల్లాలో సమాచార హక్కు చట్టం పై ప్రజల్లో అవగాహన కల్పిస్తానన్నారు. ఈ సమావేశంలోమధు, మల్లికార్జున, తిప్పేస్వామి, ఎం అమర్నాథ్, ఎం సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img