Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేరళ సర్కారుపై సుప్రీం ఆగ్రహం


బక్రీద్‌ వేడుకల కోసం కొవిడ్‌ నిబంధనలు సడలిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడిరది. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనుచితమని వ్యాఖ్యానించింది. నిబంధనల సడలింపుల వల్ల వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందితే తాము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌కు కేరళ సర్కార్‌ తలొగ్గడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.‘పౌరుల జీవించే హక్కు చాలా విలువైనది.. ఒత్తిళ్లకు తలవొగ్గి ప్రజల జీవించే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తోసిరాజనడం కుదరదు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనైనా తలెత్తి ఇబ్బంది కలిగితే ప్రజలు ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురావాలి.. అని హెచ్చరించింది. కన్వర్‌ యాత్ర కేసులో తాము ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని పేర్కొంది. కేరళ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీకే నంబియార్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేరళ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, బక్రీద్‌ అమ్మకాల వల్ల తమ ఆర్థిక సమస్యలను తగ్గించుకుంటామని భావించిన వ్యాపారులకు కలిగే కష్టాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.కాగా, దేశంలోనే ప్రస్తుతం రోజువారీ అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img