Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు పది క్రస్ట్‌ గేట్లు ఎత్తివేశారు. సాగర్‌లోకి ప్రస్తుతం 1,37,239 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో 1,26,864 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.క్రస్టు గేట్ల ద్వారా 80,900 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8718 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9274 క్యూసెక్కుల నీరు వెళుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img