Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు పదిరెట్లు పెరిగాయి. డిసెంబర్‌ 28న దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదు కాగా నిన్న 90 వేల పైచిలుకు కేసులు వచ్చాయి. దేశంలో కరోన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 2,630కి చేరింది. నిన్న కొత్తగా 495 మంది దీని బారినపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 797 మందికి ఈ కొత్త వేరియంట్‌ సోకింది. దిల్లీలో ఆ సంఖ్య 465కి పెరిగింది. మెట్రో నగరాల్లో 50 శాతానికి పైగా కేసులకు ఈ వేరియంటే కారణమని నిపుణులు భావిస్తున్నారు. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 90,928 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 325 మంది మృతి చెందారు. చికిత్స నుంచి కోలుకుని 19,206 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,85,401 యాక్టీవ్‌ కేసులుండగా.. 3,43,41,009 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్‌తో 4,82,876 మృతి చెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img