Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లంపి స్కిన్‌ డిసీజ్‌ కట్టడికి స్వదేశీ వ్యాక్సిన్‌.. కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ

పశువులలో లంపి స్కిన్‌ డిసీజ్‌ కట్టడికి రాష్ట్రాలతోపాటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు స్వదేశీ వ్యాక్సిన్‌ను భారతీయ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారని ప్రధాని పేర్కొన్నారు. గ్రేటర్‌నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ డెయిరీ ఫెడరేషన్‌ వరల్డ్‌ డైరీ సమ్మిట్‌ – 2022లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. లంపి స్కిన్‌ కారణంగా పాడి పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచేందుకు జంతువుల కదలికలను ట్రాక్‌ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా స్వదేశీ వ్యాక్సిన్‌ను భారత సైంటిస్టులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. జంతువులకు టీకాలు వేయడం లేదా మరేదైనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పాడి పరిశ్రమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img