Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వైసీపీ విజయ పరంపర

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటిసీ ఎన్నికలకు సంబంధించి 19వ తేదీ ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత వెల్లడైన ఫలితాల్లో వైసీపీ దాదాపు 90 శాతానికి పైగా స్థానాల్లో గెలు పొంది ఆధిక్యతను చాటుకొన్నది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశంతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ వెనుకబడిపోయాయి. టీడీపీకి బలమైన ప్రాంతంగా భావించే చిత్తూరు, గుంటూరు తదితర జిల్లాల్లోని తీవ్ర ఓటమిని చవి చూడటం ఆ పార్టీని నిరాశపరిచే ఫలితాలే. ముఖ్యంగా టీడీపీకి అనేక ఎన్నికల్లో ఘన విజయం కట్టబెట్టిన కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకొన్నది. తాను ఎన్నికలను బహిష్కరించానని ప్రకటి స్తున్న టీడీపీ నామినేషన్ల తర్వాత విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అప్పటికే నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో కొనసాగారని భావించాలి. వైసీపీ స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్‌ కార్పోరేషన్‌లకు జరిగిన ఎన్ని కల్లోనూ ఘన విజయం సాధిం చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ప్రకటించిన ఫలితాల ప్రకారం ఏక గ్రీవాలతో సహా వైసీపీ 8200 స్థానాల్లో, టీడీపీ 923 స్థానాల్లో గెలు పొందాయి. జడ్పీటీసీలలో ఏకగ్రీవాలతో సహా వైసీపీ 616 స్థానాల్లో, టీడీపీ 6 స్థానాల్లో గెలుపొందాయి. పాలక పార్టీ 13 జిల్లాల జడ్పీటీసీలను గెలుచుకోవడం ప్రజల్లో గల ఆదరణను సూచిస్తుంది. వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ బలానికి అనుగుణంగా తగిన స్థానాలను గెలుచుకోలేక 2019 ఎన్నికల్లో పొందిన ఓట్ల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లను వైసీపీ పొందింది. ఆ పార్టీ ఓట్ల వాటా 50 శాతానికి మించిందని అంచనా. ఈసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓట్ల శాతం పెరిగినందునే ఓట్ల వాటా పెరిగిందని భావించాలి.
విజయనగరం జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకుగాను 34, నెల్లూ రులో 46 సీట్లకు 46, చిత్తూరు జిల్లాలో 63 సీట్లలో అన్నింటినీ, కర్నూలు జిల్లాలో 52 స్థానాలకు గాను అన్ని స్థానాలను వైసీపీ గెలుచు కున్నది. అనంతపురం, కడప, విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోనూ వైసీపీ 98 శాతం జడ్పీటీసీలలో విజయం సాధించిందని అందిన సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 660 జడ్పీటీసీ స్థానాలకుగాను, 652 స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నామినేషన్లు ప్రక్రియ నాడే 126 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. 515 స్థానాలకు ఎన్నికలు జరగగా 506 స్థానాల్లో వైసీపీ గెలిచింది. 10,047 ఎంపీటీసీ స్థానా లుండగా వివిధ కారణాల వల్ల 457 సీట్లకు ఎన్నికలు జరగలేదు. 9676 స్థానాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, నామినేషన్ల ప్రక్రియ సమయంలోనే 2371 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రత్యర్థులను బెది రించి ప్రత్యర్థులను ఉపసంహరింప జేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఏక గ్రీవాలతో సహా వైసీపీ మొత్తం 8,200 స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని టీడీపీ చేసిన ఆరోపణలు కోర్టుకు చేరాయి. నిరూపణ జరగలేదు. నోటిఫికేషన్‌ జారీచేసిన నాటి నుండి దాదాపు ఏడాది పాటు కోర్టు వ్యాజ్యాల తర్వాత న్యాయ స్థానం నుండి ఓట్ల లెక్కింపునకు అనుమతి లభించింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ పార్టీ ఇంతటి విజయం సాధించడానికి బలమైన కారణం. ప్రత్యేకించి గ్రామాల్లో సచి వాలయాల ఏర్పాటు ద్వారా రైతులతో సహా అన్ని తరగతుల ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పించడం ప్రజలను ఎక్కువగా ప్రభుత్వం ఆకట్టు కోగలిగింది. సచివాలయాల ఏర్పాటుతో పాటు వలంటీర్లను నియ మించి రేషన్‌, వృద్ధాప్య ఇతర సంక్షేమ పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయడం కూడా ప్రజలను బాగా ఆకర్షించింది. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ వ్యవస్థ ఏర్పాటు పైన ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది. ఈ వ్యవస్థలో అనేక లోపాలుండవచ్చు, ఆరోపణలూ రావచ్చు. అయితే అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి, కావలసిన సమాచారం తెలుసుకొనేందుకు దోహదం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం అనాలోచితంగా ప్రటించిన లాక్‌డౌన్‌ వల్ల వేలాది మంది వలస కూలీలు ఏనాడు ఎరగనన్ని కష్టాలు పడి ఇళ్లకు చేరుకున్నారు. వలస కూలీలకు, వ్యవసాయ కూలీలకు రేషన్‌ పంపిణీ, పనులు లేని మత్స్యకారులు, ఆటో రిక్షాల వాళ్లకు, ఇంకా ఇతరులకు నగదు సాయం అందించడం కూడా ఆయా తరగతుల ప్రజలను ఆకర్షించింది.
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఏ మేరకు అభివృద్ధి చెందిందనేది చర్చించవలసిన అంశమే. పంచా యతీరాజ్‌ వ్యవస్థ కూడా, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఏడు దశాబ్దాలకు పైగా చేసిన పాలనలో సాధించిన వృద్ధి బాటలోనే వెనుకబడి ఉంది. అనేక ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేసినప్పటికీ నేటికీ 30`35 శాతం పేదరికం ఉంది. అవినీతి, బంధు ప్రీతి అపా రంగా పెరిగింది. ప్రజలకు తాయిలాలు పంపిణీ చేసి గెలుపొందడానికే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా అవినీతి జడలు విప్పి నాట్యం చేయడానికి కారణం విశదమే. ఓట్లు కొనుగోలు చేసి, అలవిమాలిన వాగ్దానాలు చేసి, ఎన్నికల్లో గెలుస్తున్న పార్టీలను, ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించడం లేదు. దిగువ స్థాయి నుండే మార్పు రావాలని కొందరు వాదిస్తున్నారు. ప్రజలు ఏదో ఒకటి ఆశించి ఓటువేసే స్థాయికి దిగజార్చింది రాజకీయ నాయకులే. ఇది నిస్సందేహం. ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు, అభ్యర్థులు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు కుల, మతాల ఆధారంగా ఓటర్లను సమీకరించడం అపరిమితమైంది. వేదికలెక్కి అవినీతిని నిర్మూలిస్తాం, కుల, మతాల ప్రసక్తి లేకుండా పాలన అంది స్తామని వాగ్దానం చేయని నాయకులు లేరు. కులాలు, మతాల మధ్య విభజన సమాజానికి తీవ్రమైన చేటు కలిగిస్తుందన్న స్పృహ లేకుండా ఏ గడ్డి గరిచి అయినా అధికారం అందలమెక్కడానికి చేయని అక్రమాలు లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థ, సామాజిక వ్యవస్థ రోజు రోజుకీ దిగజారడానికి ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థే.
రాజకీయ నాయకులు అవినీతి, అక్రమాలు లేకుండా ప్రజల అనుకూలమైన పాలన అందిస్తేనే అవినీతి జాడ్యం దాదాపు పూర్తిగా అంతమయ్యే అవకాశం భ్రష్టు పట్టిన ఈ వ్యవస్థ ప్రక్షాళన సాధ్యమైతేనే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం. ప్రజలందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img