Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

చంద్రబాబు అక్రమ అరెస్టు నుండి బ యటకు రావాలని బేబీ నాయన ఆధ్వర్యంలో నేడు పాదయాత్ర

విశాలాంధ్ర, బలిజిపేట: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టునుంచి త్వరగా బయటకు రావాలని, ఆయనక్షేమం కోరుతూ శుక్రవారం బొబ్బిలి నుండి సింహాచలం దేవస్థానంవరకు కాలినడకన టీడీపీ బొబ్బిలి నియోజక వర్గ ఇంచార్జి, మాజీ మున్సిపల్ చైర్మన్, బొబ్బిలిరాజు బేబీనాయన ఆద్వర్యంలో శుక్రవారం నిర్వహించే పాదయాత్రకు సంఘీభావంగా టీడీపినేతలు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీడీపి నియోజకవర్గ నేత వాడాడ రాము పిలుపు నిచ్చారు.ఈపాదయాత్ర శుక్రవారం ఉదయం 8:30 నిమిషాలకు కోటలోనుండి బయలుదేరి వేణుగోపాలస్వామివారి ఆలయంకు చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి వేణుగోపాలస్వామి వారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరడం జరుగుతుందన్నారు.బేబీనాయన అడుగు జాడల్లో నడిచే అవకాశాన్ని ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు సంఘీభావాన్ని తెలుపుదామన్నారు.బొబ్బిలిరాజుల ఇలవేల్పు శ్రీవేణుగోపాలస్వామివారు, ఉత్తరాంధ్ర ప్రజలఇలవేల్పు శ్రీలక్ష్మి
నృసింహస్వామీ ఆశీస్సులతో బాబుకు బెయిల్ మంజూరుతోపాటు క్షేమంగా బయటకు వస్తారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img