నిరాహార దీక్షలో పాల్గొన్న తెదేపా నాయకులు
దేశానికి రాష్ట్రపతి చేసిన ఘనత చంద్రబాబుదే
నందికొట్కూరు మాజీ ఎంపీపీ వీరప్రసాద్ రెడ్డి
తెదేపా కన్వీనర్లు …కాతా …పలుచాని
విశాలాంధ్ర -మిడుతూరు: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయనపై కుట్ర పడిన వారికి పుట్టగతులు ఉండవని తెదేపా పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గిత్త జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రమైన మిడుతూరులో తెదేపా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకంగా నంద్యాల పార్లమంటు మాజీ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మరియు నంద్యాల పార్లమెటు ఇంచార్గ్ మాండ్రా శివానంద రెడ్డి ఆదేశాల మేరకు సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం మండల తెదేపా అధ్యక్షులు కాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు . ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన నేతను అక్రమ అరెస్టు చేసి వైసీపీ నాయకులు వైశాచికత్వం పొందడం శోచనీయమన్నారు. దేశానికి రాష్ట్రపతిని , లోక సభ స్పీకర్ ను అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు . ఈ కార్యక్రమంలో నందికొట్కూరు తెదేపా అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, పగిడ్యాల తెదేపా మండల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి, నందికొట్కూరు మాజీ ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, నంద్యాల పార్లమెటు మైనారిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుల్తాన్,మిడ్తురు మండల మైనారిటీ అధ్యక్షుడు మొల్ల చాకర వలి,మనోహర్ రెడ్డి,సోపుసహెబ్,గొకరి, వెంకటేష్ రెడ్డి,రవీంద్ర,మాణిక్యరాజు,మద్దిలేటి,నాగరాజు,శేఖర్,రమణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .