Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉండాలి: చైనా

నమ్‌పెన్‌్‌: శాంతిని పెంపొందించేందుకు ఆసియా-పసిఫిక్‌ దేశాలు కట్టుబడి ఉండాలని చైనా విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు. ఆసియా`పసిఫిక్‌ దేశాలమధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని, ఈ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని సంయుక్తంగా కాపాడాలని వాంగ్‌ యి పేర్కొన్నారు. కంబోడియా రాజధాని నమ్‌పెన్‌లో జరిగిన 29వ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా మహమ్మారి,ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం, పునరుజ్జీవనం వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొన్న వాంగ్‌, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ అంతర్జాతీయ చట్టాన్ని సభ్య దేశాలు పాటించాలని, ఆయా దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉమ్మడి భద్రతను ప్రోత్సహించాలని సమావేశంలో వాంగ్‌ ప్రతిపాదించారు. అంతర్జాతీయ చట్టం ఆధారంగా అంతర్జాతీయ క్రమానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. సభ్య దేశాలు అంతర్జాతీయ వస్తువులను విస్త్రతం చేయాలని వారి స్వంత ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ఇతర దేశాల విజ్ఞప్తిని గౌరవించాలని తెలిపారు. దేశాలు తమ స్వంత అభివృద్ధి కోసం ఉమ్మడి పురోగతిని ప్రోత్సహించాలని అన్నారు. కొన్ని దేశాలు ఏకపక్షవాదం కోసం ప్రయత్నించడాన్ని చైనా వ్యతిరేకిస్తుందన్నారు. చట్టవిరుద్ధమైన ఆంక్షలు, అణచివేత చర్యలను సహించేదిలేదని వాంగ్‌ స్పష్టం చేశారు. ఇతర దేశాల సహేతుకమైన భద్రతా ఆందోళనలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, గౌరవించాలని, ఈ ప్రాంతంలో శాంతి,స్థిరత్వాన్ని సంయుక్తంగా సమర్థించాలని, నిజమైన భద్రతను సాధించాలని ఆయన దేశాలను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img