Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పోషక విలువలతోనే సంపూర్ణ ఆరోగ్యం

సూపర్వైజర్ సునీత

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత సూచించారు. శుక్రవారం కందుకూరు ప్రాజెక్టు పరిధిలోని వలేటివారిపాలెంమండలం సెక్టార్ 2 పోలినేనిపాలెం లోని అంగన్వాడీ కేంద్రంలో సీఢీపీఓ శర్మిష్ఠ చూచన మేరకు సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో పోషణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గర్భవతులు, బాలింతలు హాజరైనారు వారికి పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు గల ఆహర పదార్థాల గురించి వివరించారు. పిండిపదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఉన్న పదార్థాలలో ఎక్కువగా ఉంటాయన్నారు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లులు, మహిళలు రక్తహీనతకు గురికాకుండా వుంటుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే అను బంధ పోషకాహారం గర్భవతులు, బాలింతలు, పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కె.కృష్ణకుమారి,ఎ.అరుణ హెల్పర్లు ,పి.మల్లేశ్వరి,ఎస్ కె.అమీన, గర్భవతులు, తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img