క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని గుట్ట కిందపల్లి ఆర్డిటి స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఆర్డిటి ఆధ్వర్యంలో జూలై 22 నుండి స్కూలు క్రికెట్, కబాడీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ కోచ్ రాజశేఖర్ కబడి కోచ్ పృథ్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 20 తేది లోగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. చదువుతోపాటు క్రీడల యందు కూడా మంచి ఆసక్తిని చూపిన యెడల భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి అని తెలిపారు. చదువు, క్రీడలకు సమాన స్థాయిలో న్యాయం చేయాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రాథమిక దశ నుండే క్రీడాల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు క్రికెట్ కోచ్ రాజశేఖర్ సెల్ నెంబర్ 9985929285, తదుపరి కబడి కోచ్ పృద్వి సెల్ నెంబర్ 9966492540కు సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని బాల బాలికలు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని తెలిపారు.