దాత ఆరిఫ్ ను అభినందించిన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆచార్య కే ఎల్ సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సూక్ష్మజీవ శాస్త్ర విభాగానికి 30 వేల రూపాయల విలువ చేసే కల్చర్ మీడియా కిట్లను, నిర్ధారణ పరీక్షల్లో వాడే యాంటీబయోటిక్లను కదిరిలోని లైఫ్ లైన్ లాబరేటరీ స్ నిర్వాహకులు ఆరిఫ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్ ఎం ఓ డాక్టర్ సుభాష్ చంద్రబోస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సౌజన్య కుమార్ సమక్షంలో మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ కు అందజేయగా, దాత ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు శాలువాతో సత్కరించారు. దాత ఆరిఫ్ మాట్లాడుతూ నేను అనంతపురంలోనే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సును అభ్యసించి, కొన్ని సంవత్సరాలు అనంతపురంలో ల్యాబ్ లో పనిచేసే అనుభవాన్ని సంపాదించానని, మా గురువు డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు పిలుపుమేరకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల వ్యాధుల నిర్ధారణకు అవసరమయ్యే కల్చర్ మీడియా కిట్లను సామాజిక బాధ్యతతో అందించానని తెలిపారు. మనం సంపాదించే డబ్బును సమాజంలోని పేదవారికి ఉపయోగపడే విధంగా మనం ఖర్చు చేసినప్పుడు ఆత్మసంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఆరిఫ్ ను మైక్రో బయాలజీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ శాంతిరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శైలజ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ లలిత భవాని, మైక్రోబయాలజీ టెక్నీషియన్ భార్గవ్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అభినందించారు.