నేడు వరల్డ్ ఇమ్యునైజేషన్ డే
డా. ఏ. మహేష్
కన్సల్టెంట్ పీడియాట్రిషన్
చిన్నపిల్లల్లో టీకాలు (వ్యాక్సిన్లు) చాల కీలకమైన పాత్ర వహిస్తాయి. రోగనిరోధక శక్తి పెంచడానికి ఈ టీకాలు చాలా ఉపయోగపడుతాయి కిమ్స్ సవేరా చిన్నపిల్లల వైద్యులు ఏ. మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికంగా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఈ టీకాల మీద ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయన్నారు.. టీకాలు వేయడం ద్వారా చిన్నపిల్లలు బలహీనపడుతారు, వ్యాధులు వ్యాప్తి చెందుతాయనే అనుమానాలు ఉన్నాయి అన్నారు.. టీకాలు వేయడం ద్వారా చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని పేర్కొన్నారు. పోలియో, ఇతర అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయి అని తెలిపారు.
ప్రజల్లో ఈ టీకాల గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన వరల్డ్ ఇమ్యునైజేషన్ డే ని నిర్వహిస్తామన్నారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలకు టీకాల మీద అవగాహన పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడతారన్నారు.
ఈ టీకాలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడతాయి అని పేర్కొన్నారు. పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయండి. మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, అది మనల్ని మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా రక్షిస్తుంది, ఎందుకంటే మనం వ్యాధిని వ్యాప్తి చేయదు. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడానికి మరియు గెలవడానికి టీకా ఎంతగానో ఉపయోగపడిందన్నారు.
ఈ టీకాల సహాయంతో అనేక ప్రాణాంతక అంటు వ్యాధుల సంభవనీయతను, స్మాల్ పాక్స్‌ను తగ్గించగలిగాం. అంతేకాకుండా ఈ ప్రపంచం నుండి పోలియోను నిర్మూలించే అంచున ఉన్నాము.
టీకాలు వేసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా చాలా వరకు వ్యాక్సిన్‌లను ఉచితంగా అందజేస్తున్నారు.
టీకాలను సాధారణ ప్రజలకు ఉపయోగించే ముందు వాటి భద్రత కోసం టీకాలు చాలా రకాలుగా పరీక్షించబడతాయి. నొప్పి, జ్వరం వంటి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయన్నారు.