నేత్రదాన ప్రోత్సాహక సంఘం అధ్యక్షులు. సుబ్బరాజు
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి మనిషి అవయవ దానాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని నేత్రదాన ప్రోత్సాహక సంఘం అధ్యక్షులు, చీఫ్ అడ్వైజర్ సుబ్బరాజు, అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల సంఘం- వ్యవస్థాపకులు, అధ్యక్షులు. ఈశ్వర లింగం పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో గురువారం పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు మానవ అవయవాలపై అవగాహన సదస్సు సమావేశమును నిర్వహించారు. తదుపరి నేత్ర, దృష్టి, అవయవ, ప్రాణ, శరీర, వైద్య విద్యా దానముల యొక్క కరపత్రాలను రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, ఆదర్శ సేవా సంఘముల ప్రతినిధులు విడుదల చేశారు. అనంతరం సుబ్బరాజు, ఈశ్వర లింగం మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీ నుండి 13వ తేదీ వరకు ధర్మవరం చెన్నై కొత్తపల్లి, నార్సింగపల్లి, తాడిమర్రి, రామగిరి, మండలాలలో గల జూనియర్,డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు, అధ్యాపకులకు శరీర అవయవ దానాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేత్రదానంలో వ్యక్తి మరణించాక 6 గంటల లోపు నేత్రదానం చేయవచ్చునని, అవయవ దానములో రక్త దానాన్ని కూడా కణజాల దానం చేయవచ్చునని, మనిషి బతికుండగానే కిడ్నీ లేదా కాలేయములో కొంత భాగం దానం చేయవచ్చును అన్నారు. ఇక దేహదానం అనగా మృత శరీరధానమని అంటారు. మనిషి మృతి చెందిన తర్వాత శరీరంలో ఉండే అవయాలను దానం చేయుట అని అర్థమని తెలిపారు. అదేవిధంగా చర్మదానం లో మరణానంతరం చేసే దానం అనగా వీపు, పొట్ట, తొడలు, కాళ్లపై ఉండే చర్మాన్ని మరణానంతరం సేకరిస్తారని తెలిపారు. ఇక కేశధానములో క్యాన్సర్ బారిన పడి కిమోతెరఫీ లాంటి చికిత్స తీసుకునే వారికి జుట్టు రాలిపోతుంది ఈ కారణంగా వారు న్యూనతా భావానికి గురవుతారు. వీరికి క్యాన్సర్ వచ్చిందన్న బాధ అది ఇతరులకు తెలిసిపోతుంది అన్న భావన కారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు, భరోసా కల్పించేందుకే విగ్గులను తయారుచేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మానవుని శరీరంలోని ఏ అవయమైన స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారానే జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ వారు మాకు సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు. మానవత్వం మూర్తిభవించేలా ప్రతి ఒక్కరూ శరీర అవయవ దానం చేసినప్పుడే మానవతా విలువలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, ప్రసన్నకుమార్, షోలిగాళ్ళ వెంకటేష్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు, యువర్ ఫౌండేషన్ నాయకులు పోలా ప్రభాకర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి,కార్యదర్శి శివయ్య, కోశాధికారి సత్య నిర్ధారన్, ఆదర్శ సేవా సంఘం వ్యవస్థాపకులు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.