విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 8 న నిర్వహించు మెడికల్ కాంప్ లో బోన్ డెన్సిటీ (ఎముకలు దృఢత్వం) పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతాయని ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. సుమారు రూ. 2000లు విలువ గల బి.ఎం.డి.(బోన్ మినరల్ డెన్సిటీ) అనగా ఎముకలు దృఢత్వం పరీక్షలు చేస్తామన్నారు. 45 సం.లు పైబడిన వారు, ఎముకలు కీళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు తదితరులు ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. మెడికల్ కాంప్ కు వస్తున్న వారు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్. 96033 78145 లో సంప్రదించవచ్చు.