విశాలాంధ్ర – పరవాడ : పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోదరుడు, మాజీ ఎంపీపీ, జనసేన మండల పార్టీ ఇన్చార్జి పంచకర్ల ప్రసాద్ పుట్టిన రోజు వేడుకలను పరవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పైడిమాంబ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసాద్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలు అందజేసి ప్రసాద్ ను శాలువాతో సత్కరించారు. మాజీ జడ్పీటీసీ పైల జగన్నాధరావు, సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వియ్యపు చిన్న, టీడీపీ,జనసేన, బీజెపీ నాయకులు బుగిడి రామ గోవిందరావు, బొద్దపు శ్రీనివాసరావు, మోటూరు సన్యాసిరావు, బొండా తాతారావు, కరణం నర్సింగరావు, నగిరెడ్డి చిన్నారావు, పెదిశెట్టి సత్యారావు, గొన్న రమాదేవి, రెడ్డి శ్రీనివాసరావు, బొద్దపు అయ్యాబాబు, వర్రి పరదేశి నాయుడు, ఆర్జిల్లి అప్పలరాజు, వాసుపల్లి సోమశేఖర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.