Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉత్తరాంధ్ర అభివృద్ధికి జర్నలిస్టు లు కృషిచేయాలి

యూ జే ఎఫ్ డైరీ ఆవిష్కరణ లో డీ పీ అర్ ఓ బాల మాన్ సింగ్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: ఉత్తరాంధ్రా అభివృద్ధికి పలుసుచనలు చేసి అభివృద్ధికి జర్నలిస్టు లు కృషిచేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలమాన్ సింగ్ కోరారు. స్థానిక జిల్లా సమాచార శాఖ కార్యాలయం లో యూ జే ఎఫ్ 2022- 23 డైరీ బాల మాన్ సింగ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతూ గతం లో ఈ ప్రాంతమంతా బైక్ ర్యాలీ నిర్వహించి క్షేత్రస్థాయి లో అధ్యయనం చేయటం, ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన విధి విధానాలు రూపొందించటం వంటి మంచి కార్యక్రమాలు చేయటం అభినంద నీయమన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసల నివారణకు, స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా మరిన్ని కార్య క్రమాలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తు అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మధ్య వార దలుగా ఉంటూ మంచి సూచనలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చెయ్యాలని ఆయన కోరారు. యూ జే ఎఫ్ జిల్లా బాధ్యులు ఉల్లాకుల నీలకంటేశ్వర యాదవ్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో విశ్రాంత అధ్యాపకులు, వాకర్స్ క్లబ్ నాయకులు గేదెల ఇందిరా ప్రసాద్, జర్నలిస్ట్ లు చౌదరి లక్ష్మణ రావు, చౌదరి సత్యన్నారాయణ, గోపాలరావు, లఖి నేని రవి కుమార్, బత్తుల మురళీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img