Monday, September 25, 2023
Monday, September 25, 2023

మణిపూర్‌ ఘటన దేశానికే సిగ్గుచేటు

సీఎం బీరేన్‌సింగ్‌ వెంటనే రాజీనామా చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య

విశాలాంధ్ర -ఆలూరు : మణిపూర్‌లో మహిళలపై అత్యాచారానికి పాల్పడి, నగ్నంగా ఊరేగించిన ఘటన దేశానికే సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా మణిపూర్‌ ఘటనలను నిరసిస్తూ, ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌సింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సిపిఐ మండల కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి గత మూడు నెలల నుంచి మణిపూర్‌ను సందర్శించడానికి సమయం దొరకడం లేదు కానీ విదేశీ పర్యటనలు చేయడానికి మాత్రం సమయం దొరుకుతుందని ఎద్దేవా చేశారు. కాగా మణిపూర్‌ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని సీఎం బీరేన్‌సింగ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ముగ్గురు మహిళలలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను ఉరితీయాలని, రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను అరికట్టాలని, బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అలాగే మణిపూర్ రాష్ట్రంలో కుకీ గిరిజన వర్గానికి భద్రత కల్పించి, ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సముతి సభ్యులు భూపేష్, రైతు సంఘం మండల నాయకులు ఓతూరప్ప, ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు శివ, ఏఐవైఎఫ్ నాయకులు మునిస్వామి ఏఐఎస్ఎఫ్ నాయకులు దుర్గ నాయక్, హమాలి సంఘం నాయకులు పులి రంగన్న, రామాంజనేయులు, ఎర్రిస్వామి, నాగరాజు, ఓబులేసు లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img