టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
విశాఖ జిల్లా,విశాలాంధ్ర-భీమిలీ : పేదప్రజలు, నిస్సహాయిల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి అంతర్జాతీయ కీర్తి పొందటమే కాకుండా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అపురూప శిల్పం మదర్ థెరీసా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు
భారతరత్న మధర్ తెరీసా 114 వ జయంతి సందర్బంగా భీమిలి జోన్ 3వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గంటా నూకరాజు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్బంగా భీమిలి బీచ్ పార్క్ లో ఉన్న మధర్ తెరీసా విగ్రహానికి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గంటా నూకరాజు మాట్లాడుతూ 1910 ఆగస్టు 26 వ తేదీన ఆల్బెనియా దేశంలో పుట్టిన మధర్ తెరీసా పూర్తిపేరు ఆగ్నస్ గోంక్షా బుజక్షు అని అన్నారు. అనుకొని పరిస్థితుల ప్రభావం వలన భారతదేశం పౌరసత్వం తీసుకొని దేశ ప్రజలకు విశిష్ట సేవలు అందించారని అన్నారు. కోల్కతా లో 1950 వ సంవత్సరంలో మిషనరీష్ ఆఫ్ చారిటీ అనే సంస్థను నెలకొల్పి దేశ ప్రజలకు ఎన్నో రకాలుగా సేవలు అందించారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉండే పేదలకు, అనాధలకు, రోగ గ్రస్థులకు, మరణశయ్యపై ఉండేవారికి పరిచర్యలు చేస్తూ మానవతా దృక్పధాన్ని చాటుకున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 123 దేశాలలో 610 సంఘాలు ఏర్పాటు చేసి ఆమే నెలకొల్పిన చారిటీ ద్వారా సేవలు అందించారు. క్షయ, కుష్టు రోగులకు ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఈవిధంగా ఆమే నిస్సహాయిలకు ఎన్నో సేవలు అందించారు. ఆమే చేసిన సేవలకు గాను నోబెల్ శాంతి బహుమతి, దేశ అత్యున్నత పురష్కారం భారతరత్న ఇచ్చి గౌరవించిందని గంటా నూకరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్, సంకురుభుక్త జోగారావు, కొక్కిరి అప్పన్న, జలగడుగుల మురళి, అర్ధపాకల గురునాధ్, నొల్లి రమణ, రాజగిరి రమణ, పైడిపల్లి నర్సింగరావు, అప్పికొండ నూకరాజు, వియ్యపు పోతురాజు, నొల్లి చిన్న రమణ మహేష్, కాసరపు ఎల్లాజీ, వాడమొదలు రాంబాబు, కర్రి శివ, కందుల సుందర్ రావు, తిరుపతి రావు వాడమోదుల తైడియ్య సూరడా పరదేశి శ్రీనివాసరావు మాస్టర్, శ్రీను స్వామి, వాసుపల్లి వంశీ, చింతకాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు.