Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత

అంబేద్కర్ ఆశయసాధనకు కృషిచేద్దాం

విశాలాంధ్ర,సీతానగరం: నవ భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగానికిలోబడి అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బొబ్బిలి వేదాంత డవలపర్స్ ఎండి కోట.సురేష్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం మండలములోని అప్పయ్యపేట గ్రామంలో పెద్దఎత్తున బహిరంగ సభను నిర్వహించారు.ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పీఠికనుచదివివినిపించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ మన స్వతంత్ర భారతదేశంలో అన్నివర్గాలు స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నారంటే అందుకు అంబేద్కర్‌ మహనీయుడు రూపొందించిన రాజ్యాంగమే కారణమన్నారు. దేశం లౌకికదేశంగా అన్ని మతాలు, అన్నికులాలు, అన్నివర్గాలు, అన్నిప్రాంతాలప్రజలు కలిసిమెలసి జీవించగలుగుతున్నారంటే అది అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్ చింతగడదాస్, బొబ్బిలి ఎక్సైజ్ సీఐ ఆర్. జై భీమ్ రామ్, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు కౌలు చిరంజీవులు మాట్లడుతూ ప్రపంచంలో భారత రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగమని తెలిపారు. ప్రపంచంలోని అన్నిఅంశాలు మనరాజ్యాంగంలో పొందుపరచినసంగతిని వివరించారు. ఎంతోమంది మేధావులు అంబేడ్కర్ తో కలిసి రచించిన రాజ్యాంగ ఘనత ఎన్నటికీ చరిత్రలో నిలిచిపోతుందని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎం అర్ పి ఎస్ నాయకులు పులి డేవిడ్ మాదిగ, భోగి శ్రీను, గంటసురేష్,స్థానిక సర్పంచ్ తేరేజమ్మ, అలజింగిసర్పంచ్ రేజేటి బుజ్జి, గొంగాడ లక్ష్మణ్, తిర్లింగి తిరుపతిరావు, ఎగోటి మురళితోపాటు ఐదువేలమంది అంబేడ్కర్ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img