విశాలాంధ్ర ధర్మవరం:: విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ఆధ్వర్యంలో అబాకస్ వేదిక్ మాథ్స్ జిల్లా లెవెల్ కాంపిటీషన్లో ధర్మవరం పట్టణంలోని రూపా రాజా పీసిఎంఆర్ విద్యార్థులు ప్రతిభ కనపరచడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ రూప రాజా కృష్ణ, చైర్మన్ హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జిల్లా లెవెల్ కాంపిటీషన్లో స్టార్ జూనియర్ లెవెల్ 3 లో రెండవ తరగతి చదువుతున్న ఆపియా మొదటి బహుమతి కాగా, సీనియర్ లెవెల్ రెండు ఐదవ తరగతి చదువుతున్న సాయి సమీత రెండవ బహుమతిని, స్టార్ జూనియర్ లెవెల్ ఒకటిలో ఒకటి వ తరగతి చదువుతున్న ఉషశ్రీ మూడవ బహుమతిని సాధించడం జరిగిందన్నారు. అనంతరం హర్షవర్ధన్ రూపు రాజా కృష్ణతోపాటు జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి ,ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుత విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా గణితములో తమ తెలివితేటలతో క్యాలిక్యులేటర్ కన్నా ముందు ఉండాలని తెలిపారు విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికి తీసి గణితములో మంచి ప్రతి ఘనపరిచిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.