విశాలాంధ్ర- ధర్మవరం:: గూగూడు ఉత్సవాలను పురస్కరించుకొని ధర్మవరం నుండి గూగూడుకు ఈనెల 14వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నుండి గూగూడు కు వయా బత్తలపల్లి, నార్పల మీదుగా గూగూడు వెళుతుందని, పెద్దలకు 70 రూపాయలు పిల్లలకు 40 రూపాయలు చార్జీలు ఉంటుందని తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యం ఉండదని, బస్సులోనే టికెట్లు ఇవ్వబడుతుందని తెలిపారు. త్వరలో ధర్మవరం నుండి అయోధ్య, ధర్మవరం నుండి బెంగళూరు బస్సులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ధర్మవరం నుండి చెన్నై వయా కదిరి, తిరుపతి, మదనపల్లి ,చెన్నై మీదుగా సూపర్ లగ్జరీ బస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పెద్దలకు చెన్నైకు 775 రూపాయలు, పిల్లలకు 400, అదేవిధంగా తిరుపతికి పెద్దలకు 500 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు ఛార్జి ఉంటుందని తెలిపారు. చెన్నై కు వెళ్లే ప్రయాణికులకు తిరుమల దర్శనం టికెట్లు కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతిరోజు ధర్మారం నుండి చెన్నైకు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుతుందని, అదేవిధంగా చెన్నైలో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు, ప్రయాణికులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు, సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.