విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం
ఎస్ ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో సింటెక్ సిస్టం ఇండియా కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు గురువారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ నియామకాలకు సిఎస్సి, సి ఎస్ ఎం, సి ఎస్ డి విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు చేపట్టామన్నారు. థనూష.కె, దివ్య శ్రీ. బి, విమల జి, తేజ శ్రీ. జి ఉద్యోగ నియామక పత్రాలను అందుకున్నారు. వీరికి వార్షిక వేతనం 2.5 లక్షలు ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులను డిపిఓ రంజిత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్, కంపెనీ ప్రతినిధి రాఘవేంద్ర ప్రసాద్ శెట్టి, ప్రాజెక్టు లీడ్ శ్రీ రోహిత్, అధ్యాపక బృందం అభినందించారు.