Friday, April 19, 2024
Friday, April 19, 2024

నాడు ఉద్యమాల ఊపిరి.. నేడు సేంద్రియ బియ్యం భాండారి

తూర్పు మన్యంలో వెల్లు విరిసిన మహిళా చైతన్యం

విశాలాంధ్ర, పార్వతీపురం :నాడు శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం లో కీలకపాత్ర పోషించీ ఏకంగా ఊరి పేరుతో సాయుధ దళం ఏర్పాటు కారణమైన తూర్పు మన్యంలో ని ఓ గిరిజన గ్రామం….నేడు సేంద్రీయ పద్దతిలో వ్యవసాయ చేస్తూ ఆరోగ్య వంతమైన దంపుడు బియ్యం పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. నాడు..నేడు ఆ ఊరి మహిళలు లో వెళ్ళు విరిసిన మహిళా చైతన్యమే ముఖ్య కారణం. వివరాల్లోకి వెళితే కురుపాం మండలం లోని ఉరిడి పంచాయతీ “కొండబారిడి ” దశాబ్దాలుగా ప్రాచుర్యం పొందుతూ నే ఉంది. గతకొంత కాలం గా జట్టు స్వచ్ఛంద సంస్థ సహాకారంతో శతశాతం సేంద్రియ వ్యవసాయ పద్దతిలో పంటలు పండించేందుకు సిద్దమైన గిరిజన రైతులు అనతికాలంలోనే అనేక ప్రశంసలు పొందారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో దంపుడు బియ్యం(బ్రౌన్ రైస్)గిరాకీ గుర్తించిన ఆ గ్రామ మహిళా సేంద్రియ రైతులంతా సంఘం గా ఏర్పడి తాము పండించిన సేంద్రీయ ధాన్యాన్ని స్వంతం గా దంచి ఆకర్షణీయమైన ప్యాకింగ్ తయారీ చేసి బహిరంగ మార్కెట్ లోని కి సరఫరా చేస్తూ వ్యాపారరంగంలో తమ దైన గుర్తింపు పొందారు. అలాగే తమ సేంద్రియ బియ్యం వ్యాపారం పై ఇంటర్నెట్ లో సమాచారం పొందుపరచటంతో నేరుగా భారీ ఆర్డర్లు పొందగలుగు తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ ఎంపీ ,వైసీపీ నేత విజయ సాయి రెడ్డి మహిళలు ను అభినందించీ గిరిజన సహాకార సంస్థ ద్వారా వారి దంపుడు బియ్యం మార్కెటింగ్ చేసేందుకు అవసరమైన సహాకరించేల సూచనలు చేశారు.
దంపుడు బియ్యం వలన ప్రయోజనాలు ఇవే:
రోగ నిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
దంపుడు బియ్యం లో ఉండే 21శాతం మెగ్నీషియం ఎముకలు ద్రృడత్వానికి దోహదపడుతుంది
గోధుమ రంగు పొరలో ఉండే ఫైటా న్యూట్రిన్లు ,లిగ్నాట్ రొమ్ము క్యాన్సర్ ,గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img