Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కోనేరు భూకమిటీ సిఫారసులు అమలు చేయాలి

అట్టహాసంగా జిల్లా మహాసభలు

విశాలాంధ్ర- ఆలూరు : కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి,గిడ్డయ్య, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ లు డిమాండ్ చేశారు. ఆదివారం ఆలూరు పట్టణంలోని ఉమా కళ్యాణ మండపంలో వ్యవసాయ కార్మిక సంఘం 21వ జిల్లా మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా జిల్లా మహాసభలను పురస్కరించుకొని బికేఎంయు పతాకాన్ని సీనియర్ నాయకులు మద్దిలేటి శెట్టి చేతుల మీద ఆవిష్కరించారు. అనంతరం బికేఎంయు జిల్లా అధ్యక్షులు కృష్ణ అధ్యక్షతన జరిగిన మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నబిరసూల్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఒక 3 ఎకరాలభూమి పంపిణీ చేయడానికి కావలసినంత ప్రభుత్వ భూమి ఉందని, ప్రభుత్వం భూమి పంచకపోతే తామే భూ పోరాటాలు చేసి పేదలకు పంచుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, ఇచ్చేంతవరకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేవని అంతేకాకుండా లబ్దిదారులకు ఐదు లక్షలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అసైన్డ్ చట్ట సవరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టం తీసుకుని వచ్చి పేదల భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దారులకు బడా భూకబ్జాదారులకు అప్పనంగా అప్ప చెప్పడం కోసమే వైసీపీ ప్రభుత్వం నూతన అసైన్ చట్టం తీసుకు వచ్చిందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నేటి పాలకులు నిర్వీర్యం చేస్తున్నరని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందని అన్నారు. కొందరు అధికార పార్టీ నాయకులు ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను అడ్డం పెట్టుకుని పనిచేయకుండా ఉపాధి హామీ డబ్బులను కాజేస్తున్నారన్నారని ఆరోపించారు. ఈనెల 25 నుండి 27 వరకు బాపట్లలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా కృష్ణ, నబి రసూల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా భూపేష్, ఉపాధ్యక్షులుగా, మద్దిలేటి శెట్టి, రాజశేఖర్, నాగరాజు డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా భాస్కర్ యాదవ్, కార్యదర్శిగా సోమేశ్వర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సులోచనమ్మలతో పాటు 35 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కేశవరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విరుపాక్షి, బికేయంయు తాలూకా కార్యదర్శి రంగన్న, ఆదోని, ఆలూరు, దేవనకొండ మండల కార్యదర్శిలు కల్లుబాయి రాజు, రామాంజనేయులు, నరసారావు, ఏఐవైఎఫ్ నాయకులు మునిస్వామి, సిద్దేశ్వర కాలనీ శాఖ కార్యదర్శి నరసింహులు, భాషా, ఏఐటీయూసీ తాలూక అధ్యక్షులు శివ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img