- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలంలోని గంజికుంట-2 అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం 9వ పోషణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. సీడీపీఓ డాక్టర్ బి.వి.ఎన్. శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోషణ, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. బాలల సమగ్ర అభివృద్ధికి పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ ఎస్. రబియా, ఏఎన్‌ఎం ఎం. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


