Homeక్రీడలుటీమ్‌ఇండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ!

టీమ్‌ఇండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ!

- Advertisement -

వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు
అత్యున్నత స్థాయికి చేర్చేందుకు బీసీసీఐ హామీ

వయసు కేవలం పదిహేనేళ్లే.. కానీ అతడి బ్యాట్ ఊపితే రికార్డులు సైతం దాసోహం అనాల్సిందే! అవార్డులన్నీ ఆ పరుగుల వీరుడి పాదాల చెంత చేరాల్సిందే! ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నయా సంచలనం వైభవ్ సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ వండర్ కిడ్‌ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైభవ్ ఆటతీరుపై దేవజిత్ సైకియా ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘వైభవ్ అద్భుతమైన ఆటగాడు. అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది్ణ్ణ అని కొనియాడారు. అతణ్ని అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడానికి, ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దడానికి బీసీసీఐ తరఫున అన్ని రకాలుగా పూర్తి మద్దతు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ బిహార్ కుర్రాడు.. సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టోర్నీలోనే అత్యధికంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అది కూడా ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆరెంజ్ క్యాప్ విజేతగా చరిత్ర సృష్టించాడు.

గతంలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్ (2025లో 23 ఏళ్ల 231 రోజులు), శుభ్‌మన్ గిల్ (2023లో 23 ఏళ్ల 263 రోజులు) అతి తక్కువ వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రికార్డులను వైభవ్ తుడిచిపెట్టేశాడు. ఈ టీనేజ్ సంచలనం ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలను పెంచేలా చేశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు