Homeజిల్లాలునెల్లూరుకూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి

- Advertisement -

సర్పంచ్ రాజా రమేష్

విశాలాంధ్ర :గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలల్లో 90 శాతం వరకు అమలు చేశామని 100 శాతం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూనిపాలెం సర్పంచ్ నవులూరి రాజా రమేష్ తెలిపారు. సోమవారం వలేటివారిపాలెం మండలంలోని కూనిపాలెం గ్రామంలో సర్పంచ్ రాజా రమేష్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూనిపాలెం గ్రామం లో సంవత్సరం కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజా రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనుమోలు సుధాకర్ రావు, డీలర్ మన్నం నరేష్, దామా రమేష్, గట్టమనేని లక్ష్మీనరసింహం, ఘట్టమనేని మాల్యాద్రి, గ్రామస్తులు కె. శ్రీనివాసులు, వై. ప్రసాద్, జె. విజయకుమార్, తోకల నరసింహం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు