వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజినికు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గతంలో రెంటపాళ్లకు చేసిన పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి భారీగా జన సమీకరణ జరిపారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
ఈ కేసులో రజినిని విచారణకు పిలుపిస్తూ ఈ నెల 20న హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
113 మందికి నోటీసులు
గత జూన్ 18న సత్తెనపల్లిలో బల ప్రదర్శన, ప్రజా ఆస్తుల ధ్వంసానికి సంబంధించి నమోదైన కేసులో మొత్తం 113 మందికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు వైసీపీ నాయకుడు గజ్జల సుధీర్‌రెడ్డి కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు.