Friday, April 19, 2024
Friday, April 19, 2024

6 వేల 95 కోట్ల రూపాయలతో నాబార్డ్ రుణ ప్రణాళిక విడుదల

. వ్యవసాయ రుణాలకు అత్యధిక ప్రాధాన్యం
. ఈ ఏడాది గ్రౌండ్ అయిన నిధులన్నీ మార్చి లోగా బట్వాడా జరగాలి
. బ్యాంకర్ల సమావేంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్

విశాలాంధ్ర కలెక్టరేట్ – విజయనగరం, జనవరి 18: నాబార్డ్ ద్వారా వ్యవసాయానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. నాబార్డ్ 2023 -24 ఆర్ధిక సంవత్సరానికి 6 వేల 95 కోట్ల రూపాయలతో రూపొందించిన రుణ ప్రణాళికను సంయుక్త కలెక్టర్ ఆవిష్కరించారు. బుధవారం ఎల్.డి.ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యం లో కలెక్టరేట్ సమావేశ మందిరం లో బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నాబార్డ్ రుణ ప్రణాళిక లో వ్యవసాయ రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులు, నిర్వహణ, మార్కెటింగ్, జల వనరులు, వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్, పశు సంవర్ధకం, డైరీ , పౌల్ట్రీ, షీప్, గొట్ మత్స్య సంబంధిత రంగాలకు రూ. 3, 685 కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. మిగిలిన నిధులు వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ షెడ్ డెవలప్మెంట్, సాయిల్ కన్సర్వేషన్ , ఇంధన వనరులు, విద్య, హౌసింగ్ సోషల్ ఇన్ఫ్రా , ఎం.ఎస్.ఎం.ఈ వర్కింగ్ కాపిటల్ తదితర రంగాలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ రుణ పరపతి పై అవగాహన కలిగించుకొని, సంబంధిత లబ్దిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.
ఈ ఏడాది గ్రౌన్డింగ్ జరిగిన పదకాలన్నీ ఈ మార్చి నెలాఖరు లోగా మంజూరు చేసి నగదు బట్వాడా జరగాలన్నారు. ఉద్యాన వన శాఖ, మత్స్య శాఖ, డి.ఆర్.డి.ఏ, వ్యవసాయ, హౌసింగ్ కు సంబంధించిన పధకాల కోసం మంజూరైన నిధులన్నీ వెంటనే లబ్ది దారుల ఖాతాలలో పడేలా చూడాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా పరిగణిస్తున్నందున చిరు ధాన్యాల సాగును ప్రోతహించాలని, వర్క్ షాప్ ల ద్వారా అవగాహన కలిగించి, అందుకు తగు శిక్షణలు ఇవ్వాలని , చిరుధన్యాలను పండిస్తున్న రైతుల విజయ గాధలను వివరించాలని ఉద్యాన శాఖ డి.డి. జమదగ్నికి సూచించారు. ఈ క్రాప్ డేటా ను పంట వారీగా, రైతు వారీగా నమోదు చేసి అర్హత మేరకు పంట రుణాలను విరివిగా అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారి త్రినాధ స్వామి కి సూచించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు 5 వ విడత దరఖాస్తులు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లించాలని, తర్వాత 6 వ విడత దరఖాస్తులను గ్రౌన్డింగ్ చేయాలనీ బ్యాంకు అధికారులకు తెలిపారు. ఈ అంశం పై బ్యాంకు అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించి, ప్రత్యెక దృష్టి పెట్టాలన్నారు. అదే విధంగా గృహాలకు సంబంధించి రుణాలను ఎలాంటి పెండింగ్ లేకుండా మంజూరు చేయాలన్నారు. ఆర్ధిక అక్షరాస్యత పై మండల స్థాయి లో ఏ.పి.ఎం లు, స్థానిక బ్యాంకు అధికారులు కలసి అవగాహన కలిగించాలన్నారు. ఆ మేరకు డి.ఆర్.డి.ఏ పి.డి సర్కులర్ జరీ చేయాలనీ సూచించారు. యువత కు స్వయం ఉపాధి అవకాశాలను వివరించడానికి కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యం లో అవగాహనా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశం లో నాబార్డ్ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, రిజర్వు బ్యాంకు ప్రతినిధులు, జిల్లాలోని అన్ని బ్యాంకు లకు చెందిన అధికారులు, జిల్లా అధికారులు డి.ఆర్.డి.ఏ , మెప్మ పి.డి లు కళ్యాణ చక్రవర్తి, సుధాకర రావు, పశు సంవర్ధక శాఖ జే.డి. డా. రమణ, మత్స్య శాఖ డి.డి. నిర్మలా కుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img