Friday, December 8, 2023
Friday, December 8, 2023

అక్షయ పాత్ర ఫౌండేషన్ , గంభీరం , ఆనందపురం

జాగృతి యాత్ర అక్షయ పాత్ర ఫౌండేషన్ గంభీరం ,వంటశాల సందర్శన
స్థలము : అక్షయ పాత్ర ఫౌండేషన్ , గంభీరం , ఆనందపురం , ఐఐఎం రోడ్
తేదీ : 02-11-2023, సమయం : ఉదయం11.30 నిముషములకు

విశాలాంధ్ర- అనందపురం : జాగృతి సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలనుండి జాగృతి యాత్రను నిర్వహించుచున్నారు. ఈ యాత్రలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామిక రంగములో ఆసక్తిగలిగిన 550 మంది యువతీ, యువకులు జాగృతియాత్రలో 25 దేశాలనుంచి పాల్గొన్నారు. . ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే ఈ యాత్ర లో జి-20 దేశాల సభ్యులు పాల్గొన్నారు. ఈ యాత్ర ముంబయినగరంలో ఈ నెల 28 వ తేదీన ప్రారంభమై, దేశములోని 10 మహానగరాలను సందర్శించేదానికోసం 18 భోగీలు కలిగిన ఒక ప్రత్యేక ట్రైన్ లో ఈ రోజు అనగా 02వ తేదీ ఉదయం 11.30 గం.కు విశాఖపట్నం లో గల అక్షయపాత్ర ఫౌండేషన్ , గంభీరం వంటశాల కు చేరుకుంటారు. ఈ వంటశాలలలో అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహణ విధానము గురించి తెలుసుకుంటారు .
ఈ కార్యక్రమము ముఖ్య అతిధి శ్రీమాన్ సత్యగౌర చంద్ర దాస గారు ప్రెసిడెంట్ అక్షయ పాత్ర ఫౌండేషన్ (ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ) జాగృతి యాత్రికులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ పనిచేయు విధానం తెలియచేయుదురు. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువ పారిశ్రామిక వేత్తలను తయారుచేయడం. ఈ యాత్రలో భాగంగా మధురైలోని అరవింద్ కంటి ఆసుపత్రి, బెంగుళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ, మద్రాసులోని ఇంఫీల్డ్ కర్మాగారం విశాఖపట్నం లోని అక్షయపాత్ర ఫౌండేషన్లను సందర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img