విశాలాంధ్ర-అనంద పురం : ఆనందపురం మండలంలో వెల్లంకి గ్రామపంచాయతీలో బాలికల సాధికారత సంబంధిత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ‘బేటీ బచావో బేటీ పడావో’ (బీబీబీపీ) పథకాన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లంకి గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు తెలిపారు. కళాజాత కార్యక్రమం అవగాహన సదస్సు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫిసర్, గ్రామ విఆర్‌వో వెంకట్ రెడ్డి , గ్రామ మహిళ పోలిస్ స్యామల, అంగన్‌వాడి వర్కర్లు కుమారి, ప్రజలు పాల్గొన్నారు.